
అంతర్జాతీయ వాణిజ్యంలో భారతదేశమే ఇంజన్ – IMF, వరల్డ్ బ్యాంక్ అభిప్రాయం: USలో ఎఫ్‌ఎం నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు
సాన్ ఫ్రాన్సిస్కో | ఏప్రిల్ 21, 2025: అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో స్థిరమైన పాలన వలన భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.
IMF, వరల్డ్ బ్యాంక్‌లు భారతదేశాన్ని అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రధాన ఇంజన్‌గా చూస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ‘‘2026 నాటికి ఫిస్కల్ డెఫిసిట్‌ను 4.5% లోపల ఉంచేందుకు మేము కట్టుబడి ఉన్నాం’’ అని పేర్కొన్నారు.
‘‘వికసిత భారత్ 2047’’ లక్ష్యంగా మహిళలు, రైతులు, యువత, పేదలపై దృష్టి పెట్టి పెద్ద ఎత్తున డిజిటల్ మౌలిక సదుపాయాలు మరియు సన్‌రైజ్ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నామని తెలిపారు.
ఆమె పర్యటనలో భాగంగా స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో కీలక ప్రసంగం, IMF–వరల్డ్ బ్యాంక్ స్ప్రింగ్ మీటింగ్స్, జి20 ఆర్థిక మంత్రుల సమావేశాల్లో పాల్గొంటున్నారు.
అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, సౌదీ మంత్రులతో ద్వైపాక్షిక చర్చలు, తరువాతి పర్యటనగా ఏప్రిల్ 26–30 వరకు పెరూ వెళ్లనున్నారు.