Headlines

మనీలాండరింగ్ కేసులో మహేశ్ బాబు కు ఈడీ నోటీసు

టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు కి మనీలాండరింగ్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ ఫైనాన్షియల్ కంపెనీపై ఈడీ విచారణ కొనసాగుతున్న సందర్భంలో ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. ఆ సంస్థ డైరెక్టర్లను విచారించిన సమయంలో మహేశ్ బాబు పేరు ప్రస్తావనకు వచ్చింది. గతంలో మహేశ్ బాబు ఆ సంస్థకు చెందిన బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయనపై నేరుగా ఎలాంటి ఆరోపణలు లేకపోయినా, బ్రాండ్ ప్రచారంలో పొందిన ఆర్థిక లావాదేవీలపై సమాచారం కోరుతున్నట్లు అధికారులు తెలిపారు. మహేశ్ బాబు జట్టు ఇంకా అధికారిక స్పందన ఇవ్వలేదు. ఈ వారంలో ఆయన ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *