
ఢిల్లీ కోర్టులో సంచలనం – న్యాయమూర్తిని బెదిరించిన దోషి, న్యాయవాది
ఢిల్లీ ట్రయల్ కోర్టులో శిక్షా విధింపు సమయంలో దోషి, న్యాయవాది కలిసి మహిళ న్యాయమూర్తిని బెదిరించిన ఘటన చర్చనీయాంశమైంది. “తూ హై క్యా చీజ్?” అంటూ నేరస్తుడు న్యాయమూర్తిని ప్రశ్నించగా, న్యాయవాది అతనికి మద్దతుగా ఉన్నాడు. కోర్టు సిబ్బంది, పోలీసు అధికారులు వెంటనే జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ వ్యవహారంపై ఢిల్లీ బార్ కౌన్సిల్ తీవ్రంగా స్పందించింది. మహిళా న్యాయమూర్తి భద్రత సమస్యలతో సెలవు తీసుకున్నారు. ఢిల్లీ హైకోర్టు ఈ ఘటనపై నివేదిక కోరనుంది. గతంలో లక్నోలో మహిళా మేజిస్ట్రేట్‌పై జరిగిన వేధింపుల ఘటనను గుర్తు చేస్తూ న్యాయనిపుణులు న్యాయ వ్యవస్థపై భద్రత పెంపును సూచిస్తున్నారు. కోర్టుల్లో సెక్యూరిటీ వ్యవస్థలు మరింత మెరుగుపరచాల్సిన అవసరం స్పష్టమవుతోంది. న్యాయమూర్తులపై ముప్పు పెరుగుతోందన్న ఆందోళన పెరుగుతోంది.