Headlines

భారత-అమెరికా వాణిజ్య ఒప్పందం అంచనాలపై మార్కెట్ జంప్ – బ్యాంక్ నిఫ్టీ 862 పాయింట్లు పెరిగింది

ముంబై | ఏప్రిల్ 22, 2025: భారత స్టాక్ మార్కెట్ సోమవారం సానుకూల టోన్‌తో ప్రారంభమైంది. భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై పాజిటివ్ బజ్, అంతర్జాతీయ ట్రెండ్‌లు మార్కెట్‌ను ప్రభావితం చేశాయి.

సెన్సెక్స్‌ 396 పాయింట్లు (0.50%) పెరిగి 78,949 వద్ద, నిఫ్టీ 98 పాయింట్లు (0.41%) పెరిగి 23,949 వద్ద ట్రేడ్ అయ్యింది. బ్యాంక్ నిఫ్టీ 862 పాయింట్లు (1.59%) పెరిగి 55,152 వద్ద ట్రేడ్ అయింది.

టెక్ మహీంద్రా, HDFC, ICICI, అక్సిస్ బ్యాంక్ లాంటి కంపెనీలు టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఆసియన్ పెయింట్స్, టైటాన్ వంటి స్టాక్స్ లాస్‌లో ఉన్నాయి.

FIIలు ₹4,667 కోట్లు కొనుగోలు చేయగా, DIIలు ₹2,006 కోట్లు విక్రయించారు. నిపుణుల అంచనాల ప్రకారం నిఫ్టీ 24,200-24,500 వద్ద రిజిస్టెన్స్ ఎదుర్కొనవచ్చునన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *